పిల్లలకు పుష్టిగా భోజనం


Wed,September 11, 2019 02:52 AM

Nutritious meals for Childrens

- పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
- సమర్థంగా అమలు.. ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలు


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్కారు నాణ్యమైన, పోషకాహారాన్ని అందిస్తున్నది. పోషక విలువలకు లోపం రాకుండా సన్నబియ్యంతో పుష్టిగా మధ్యాహ్న భోజనం పెడుతున్నది. వారంలో మూడురోజులు గుడ్లు వడ్డిస్తున్నది. 2018-19లో 22,73,043 మంది విద్యార్థుల్లో సుమారు 20 లక్షల మందికి సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. 1-5 తరగతి వరకు 10.23 లక్షల మంది, 6-8 తరగతి వరకు 5.92 లక్షల మంది, 9, 10 తరగతి వరకు 4.29 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులతో 9, 10వ తరగతుల వారికి సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది.

ఇదీ.. ఆరురోజుల భోజనం పట్టిక

ఆరురోజుల భోజనం పట్టిక ప్రకారం మొదటిరోజు అన్నంతోపాటు గుడ్డు, కాయగూరలు, రెండోరోజు అన్నం, ఆకుకూరలు, పెరుగు, మూడోరోజు అన్నం, గుడ్డు, కూరగాయలు, నాలుగోరోజు అన్నం, కూరగాయలు, సాంబారు, ఐదోరోజు అన్నం, గుడ్డు, కూరగాయలు, ఆరోరోజు కూరగాయల స్పెషల్ రైస్ పెట్టాలి. ఈ పథకం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నదని, స్కూల్‌కు వచ్చినవారిలో 90 శాతం వరకు అన్నం తింటున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పథకం అమలు విషయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రికార్డులను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. స్కూల్‌కు ఎంతమంది విద్యార్థులు వచ్చారు? ఎంతమంది అన్నం తిన్నారు? వంటి వివరాలను అధికారులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందించాలి. భోజన పథకంలో స్కూల్ కమిటీలను, విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలి. ఈ పథకం అమలులో పరిశుభ్రత తప్పకుండా పాటించాలని, ముఖ్యంగా అన్నాన్ని శుభ్రమైన పాత్రలో వండటం, భోజన ప్లేట్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు టేస్టింగ్ రిజిస్టర్, బియ్యం స్టాక్ రిజిస్టర్, సరఫరా రిజిస్టర్, అన్నం తిన్నవారితో తయారుచేసిన రిజిస్టర్ తప్పకుండా అమలుచేయాలి.
MID-DAY-MEALS1

424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles