1.10 కోట్లకు చేరిన గొర్రెల సంఖ్య


Tue,October 16, 2018 02:15 AM

number of sheeps reached 1 10 crores

-గొల్ల, కుర్మలకు పంపిణీ చేసిన గొర్రెల వృద్ధిపై కేంద్ర పశుసంవర్ధకశాఖ సర్వే
-రూ.1,500 కోట్ల గొర్రెల సంపద వృద్ధిచెందినట్టు గుర్తింపు
-సూడు సమయం కావడంతో మరింత పెరుగనున్న గొర్రెల సంఖ్య
-సంపదకు అనుగుణంగా పశుసంవర్ధకశాఖ ముందస్తు ప్రణాళికలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర ్టప్రభుత్వం గొల్ల, కుర్మలకు అమలుచేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో పల్లెసీమల్లోని యాదవ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ పథకం కింద రూ.3,200 కోట్ల వ్యయంతో 3,33,774 యూనిట్ల చొప్పున మొత్తం 70,09,254 గొర్రెలను పశుసంవర్ధకశాఖ పంపిణీ చేసింది. ఈ ఆరునెలల కాలంలో కొత్తగా పుట్టిన 41 లక్షల గొర్రెపిల్లల్ని కలుపుకొంటే.. రూ.1,500 కోట్ల విలువైన 1.10 కోట్ల గొర్ల సంపద వృద్ధి చెందినట్టు కేంద్ర పశుసంవర్ధకశాఖ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని గొల్ల, కురుమలను ఆర్థికంగా ఆదుకొనేందుకు వారికి గొర్రెలను పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాల నుంచి నిత్యం 300 నుంచి 400 యూనిట్ల చొప్పున గొర్రెలను కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 3,33,774 యాదవ కుటుంబాలకు 20 గొర్రెలు, 1 పొట్టేలు చొప్పున 70,09,254 గొర్రెలను పంపిణీ చేశారు.

ఆరునెలల్లో వీటికి 41 లక్షల గొర్రెలు పుట్టాయి. దీంతో ఏడాదికాలంలోనే 1.10 కోట్ల గొర్ల సంపద రాష్ట్రంలో తయారైంది. గొర్రెల పంపిణీ పథకం స్థితిగతుల అధ్యయనానికి కేంద్ర పశుసంవర్ధకశాఖ రాష్ట్రంలో పశుగణన చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి? పుట్టినవి ఎన్ని? సబ్సిడీ గొర్రెలు ఎంతమంది లబ్ధిదారుల వద్ద ఉన్నాయి? ఎంత మంది విక్రయించారు? వంటి అంశాలను ఈ సర్వేలో నిర్ధారించనున్నట్టు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆగస్టు నుంచి నవంబర్ నెలలు గొర్రెలకు సూడు (గర్భధారణ) సమయం కావడంతో వీటి సంపద మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. రానున్నరోజుల్లో పశు సంపదను వివిధ వ్యాధుల నుంచి కాపాడేందుకు రూ.10కోట్లతో మందులు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.

ఆర్థిక పరిపుష్టి పొందుతున్న యాదవులు

ప్రభుత్వం నుంచి అందివస్తున్న ప్రోత్సాహం కారణంగా యా దవుల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతున్నాయి. కొత్త సంపద వృద్ధితో గొల్ల, కుర్మలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. గొర్రెల మంద వద్దకే వచ్చి వైద్యం అందించేందుకు 100 గ్రామీణ నియోజకవర్గాల్లో 1,962 మొబైల్ అంబులెన్స్‌లను ప్రభు త్వం నెలకొల్పింది. పశుగ్రాసం కొరత రాకుండా 75 శాతం సబ్సిడీతో 200 టన్నుల పశుగ్రాస విత్తనాలను నిల్వచేశారు. పంపిణీ చేసిన గొర్రెలన్నింటికీ బీమా వర్తింపచేసి.. చనిపోయిన గొర్రెల స్థానంలో కొత్త వాటిని అందజేశారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా గొర్రెల పంపిణీ

రాష్ట్రంలో చేపడుతున్న గొర్రెల పంపిణీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , రాజస్థాన్‌లకు చెందిన అధికారులు రాష్ట్రంలో పర్యటించి.. ఇక్కడ అమలుచేస్తున్న పంపిణీ విధానాన్ని పరిశీలించారు. గొర్రెల కొనుగోలు, సబ్సిడీ విధానం, లబ్ధిదారుల వాటా, గొర్రెల సరఫరా వంటి అంశాలను అధ్యయనం చేసి తమ రాష్ర్టాల్లో అమలుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles