ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు కు‘స్వర్ణశక్తి’ అవార్డు

Mon,November 11, 2019 01:26 AM

జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్టీపీపీ)కు భద్రతా విభాగంలో స్వర్ణశక్తి అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 45వ ఎన్టీపీసీ రైజింగ్‌డే సాంస్కృతిక కార్యక్రమాల్లో శనివారం రాత్రి కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి(ఐసీ) ఆర్కేసింగ్‌ చేతుల మీదుగా ఎన్టీపీసీ సదరన్‌ రీజినల్‌ ఇంచార్జి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆర్‌ఈడీ) పీపీ కులకర్ణి పురస్కారం అందుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తీసుకున్న భద్రత, రక్షణ చర్యలు, అమలుపరిచిన తీరుపై 2018-19 ఏడాదికి ఈ పురస్కారం లభించింది. కార్యక్రమంలో విద్యుత్‌ కార్యదర్శి ఎస్‌ఎన్‌ సహాయ్‌, ఎన్టీపీసీ సీఎండీ గుర్‌దీప్‌సింగ్‌ పాల్గొన్నారు.

81
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles