గృహనిర్మాణాలకు ఎండీసీ ద్వారా ఇసుక సరఫరా


Fri,July 12, 2019 01:48 AM

Now, book construction sand online

- ఆన్‌లైన్‌లో కొనుగోలుకు బుకింగ్ సదుపాయం
- టన్నుకు రూ.1,250, రవాణా ఖర్చు అదనం


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గృహనిర్మాణ అవసరాల దృష్ట్యా నిర్మాణ ప్రాంగణం వద్దకే ఇసుక సరఫరా చేయనున్నట్టు టీఎస్‌ఎండీసీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. టన్ను ఇసుక ధర రూ.1,250 ఉంటుందని, రవాణా ఖర్చుతో కలిపి రూ. 1,350 నుంచి 1,450 వరకు కావచ్చని ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండటంతోపాటు ఒకేసారి 12 టన్నుల ఇసుక కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. www.sand.telangana.gov.in/ tssand portal/masters/home.aspx వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఇసుక 6 టైర్ల టిప్పర్ ద్వారా సరఫరా అవుతుందని, ఆన్‌లైన్ బుకింగ్ అయిన వెంటనే వినియోగదారుడి ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, ఈ ఓటీపీని ఇసుక తెచ్చిన ట్రక్ డ్రైవర్‌కు ఇవ్వాలని తెలిపారు. ఇసుక కొనుగోలు చేయదలిచినవారు హైదరాబాద్ చుట్టపక్కల గల అబ్దుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి, బౌరాంపేట్ నిల్వకేంద్రంలో ఇసుకను చూసి కొనుగోలు చేసుకోవచ్చని, ఏమైనా సందేహాలుంటే 040-23323150/155242 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

551
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles