పట్టిసీమ వాటాను మీరే తేల్చండి


Tue,April 16, 2019 01:35 AM

No decision taken by the Water Commission Chairman

-ఢిల్లీ సమావేశంలో తీర్మానం మేరకు చర్యలు తీసుకోండి
-కేంద్ర జలవనరులశాఖకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ గోదావరిజలాలను కృష్ణా డెల్టాకు తరలించడం.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను పెంచడంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా.. కేంద్ర జల సంఘం చైర్మన్‌కు లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ పోలవరం (పట్టిసీమ) ద్వారా గోదావరిజలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించేందుకు పనులు మొదలుపెట్టగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ర్టాలకు కృష్ణాజలాల్లో ఆ మేరకు వాటా పెంచాల్సి ఉన్నది. అంటే 80 టీఎంసీల కృష్ణాజలాలను ఆయా రాష్ర్టాలకు పంచాలి. దాని ప్రకారం ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు కృష్ణాజలాల్లో 35 టీఎంసీల అదనపు వాటాను అనుభవిస్తున్నాయి. కానీ తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై బజాజ్ కమిటీని కూడా వేసిన కేంద్రం ఆపై ఎటూ తేల్చకుండానే దానిని అటకెక్కించింది.

ఏ నిర్ణయమూ తీసుకోని జల సంఘం చైర్మన్

గత ఏడాది ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ నదీ యాజమాన్య బోర్డులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్ర జల సంఘం చైర్మన్ ద్వారా ఆ వాటాను తేల్చాలని నిర్ణయించింది. కానీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గత ఏడాది జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర జల సంఘం చైర్మన్ వాటాను తేల్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కృష్ణా బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా ఇటీవల లేఖ రాశారు.

1100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles