పసిగుడ్డుపై పైశాచికం


Thu,June 20, 2019 02:25 AM

Nine month old girl dies after man allegedly gags her during rape attempt

-తొమ్మిది నెలల చిన్నారిపై యువకుడి లైంగికదాడి
-మృతి చెందిన పాప
-నిందితుడిని ఉరి తీయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
-కేసు నమోదు చేసి అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

వరంగల్ క్రైం : తొమ్మిది నెలల పసిగుడ్డుపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. చిన్నారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. హన్మకొండలో ఉంటున్న తల్లిగారింటికి రెండు రోజుల క్రితం చిన్నారిని తీసుకొని తల్లి హైదరాబాద్ నుంచి వచ్చింది. వేసవి కావడంతో మంగళవా రం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి డాబాపై పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత తల్లి పక్కన పా ప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కు టుంబసభ్యులు రాత్రి 2.30 సమయంలో ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. కుమార్‌పల్లి బొమ్మలవేపచెట్టు ప్రాంతంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం వసంత్‌పూర్‌కు చెందిన పోలెపాక ప్రవీణ్ పాపను టవల్‌లో చుట్టుకొని భుజంపై వేసుకొని ఉండగా యువకులు చూశారు.

వీరిని చూసిన నిందితుడు పాపను నేలకేసి కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకులు అతన్ని పట్టుకొని దేహ శుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పాపకు అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాగా, నిందితుడిని ఉరి తీయాలంటూ హన్మకొండ పోలీస్‌స్టేషన్ సమీపంలోని అశోక జంక్షన్‌లో కుటంబసభ్యులు ఆందోళన చేశారు. నిందితుడు హన్మకొండలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు.

అర్ధరాత్రి పని ముగించుకుని వచ్చిన తర్వాత మ హిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. మంగళవారం అర్ధరాత్రి పాప నిద్రిస్తున్న ఇంటికి వెళ్లి రెండు సెల్‌ఫోన్లను కూడా దొంగించాడు. అక్కడే స్లాబ్‌పై ఉన్న పాపను తీసుకొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప మేనమామ ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 366, 302, 376ఎ, 376ఏబీ, 379, 5 (ఎం) రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్షన్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు.

4257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles