కేటీఆర్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్లు


Wed,June 12, 2019 02:47 AM

Newly elected ZP Chairpersons meet KTR

కేసీఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటీవల ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మంగళవారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందిస్తూ.. గ్రామాల అభివృద్ధికి ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేయాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ను కలిసినవారిలో నిర్మల్ జెడ్పీ చైర్‌పర్సన్ కే విజయలక్ష్మి, వైస్‌చైర్మన్ సాగరబాయి, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, వైస్‌చైర్మన్ ఆరె రాజన్నతోపాటు కో-ఆప్షన్ సభ్యులు సుభాష్‌రావు, రఫీక్ అహ్మద్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, జోగు రామన్న, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరిరావు, రాంకిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ktr-ik-reddy3

టీఎన్జీవో, ఆటో యూనియన్ నేతల శుభాకాక్షలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ నాయకులు మంగళవారం కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, రామినేని శ్రీనివాస్‌రావు ఎస్‌ఎం ముజీబ్ హుస్సేన్, రాయకంటి ప్రతాప్, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, కొండాల్‌రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కూడా కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌కేవీ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ktr-ik-reddy2

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles