డాటా ఆఫ్ ఉన్నా ఎస్వోఎస్ నొక్కొచ్చు

Thu,December 5, 2019 02:09 AM

-హాక్‌ఐ యాప్‌లో కొత్త ఫీచర్
-జతచేసిన తెలంగాణ పోలీసులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏదైనా ఆపద లో ఉన్నారా? మీ మొబైల్‌లో ఇంటర్నెట్ డాటా ఆఫ్‌లో ఉన్నదా? అయినా ఫర్వాలేదు. మొబైల్ డాటా ఆఫ్‌లో ఉన్నా ఇకపై పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చేందుకు మీ మొబైల్‌లోని హాక్‌ఐ యాప్‌లో ఎస్వోఎస్ (సేవ్ అవర్ సోల్) బటన్ నొక్కొచ్చు. సమాచారం క్షణాల్లో పోలీసులకు వెళ్తుంది.. మిమ్మ ల్ని ఆపద నుంచి కాపాడుతారు. ఈ మేరకు హాక్ ఐ యాప్‌లో అదనపు ఫీచర్‌ను తెలంగా ణ పోలీసులు జతచేశారు. మొబైల్ డాటా ఆఫ్ ఉన్నప్పుడు ఎస్వోఎస్ బటన్ నొక్కినా నేరుగా డయల్ 100కు ఫోన్ వెళ్లేలా యాప్ లో మార్పులు చేసినట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు.

312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles