ముళ్లపొదల్లో మగశిశువు మృతదేహం


Wed,June 12, 2019 01:14 AM

new born baby found in bush

మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లకల్‌లో ముళ్లపొదల్లో ఓ గుర్తుతెలియని మగశిశువు మృతదేహం కనిపించింది. ఎస్సై వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకల్ గ్రామంలోని పోచమ్మ దేవాలయ సమీపంలో గల ముళ్లపొదల్లో అప్పుడే పుట్టి మరణించిన ఓ మగశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కవర్లలో పెట్టి పారవేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఎస్సై వరప్రసాద్, అంగన్‌వాడీ టీచర్ కృష్ణవేణి, సీడీపీవో హేమలత భార్గవి అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించారు. అంగన్‌వాడీ టీచర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles