బీజేపీకి ఎప్పుడూ దూరం కాలేదు: పవన్ కల్యాణ్

Thu,December 5, 2019 01:19 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ- జనసేన విలీనం దిశగా రాజకీయ ప్రకటనలు వెలువడుతున్నాయి. పవన్ కల్యాణ్ మూడురోజుల తిరుపతి పర్యటనలో సీఎం జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టి.. బీజేపీని ఆకాశానికెత్తారు. ప్రస్తుత రాజకీయాలకు అమిత్ షా, మోదీ లాంటి వ్యక్తులే కరెక్టు అన్న పవన్.. బీజేపీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని, కలిసే ఉన్నానని చెప్పారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమిత్ షా అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మంచిపాలన అందిస్తున్నదని కితాబిచ్చారు. బీజేపీలో జనసేన విలీనంపై అడగగా ఇప్పుడే చెప్పలేనని సమాధానమిచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే.. మంత్రులు ఆయనపై మూకుమ్మడిగా దాడిచేయడం సరికాదని హితవుపలికారు.

289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles