14 నుంచి జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ పర్యటన

Sun,October 13, 2019 01:34 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ మన్హర్ వల్జిభాయ్ జాలా నేతృత్వంలోని ప్రతినిధి బృందం 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నది. 14న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ అతిథిగృహంలో తెలంగాణ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార అభివృద్ధిసంస్థ, తెలంగాణ గ్రామీణబ్యాంకు, లీడ్‌బ్యాంకు, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ అధికారులతో కమిషన్ చైర్మన్ వల్జిభాయ్‌జాలా బృందం సమీక్షించనున్నది మధ్యాహ్నం 2 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంలో సఫాయి కర్మచారి ఉద్యోగ సంక్షేమసంఘాలు, షెడ్యూల్ కులాల మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, నగర పోలీస్ కమిషనర్లు, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కలెక్టర్లతో సమావేశమవుతారు.


15న ఉదయం 9.30గంటలకు స్వచ్ఛభారత్‌లో, 10.30 గంటలకు సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వైద్యశిబిరంలో బృందం సభ్యులు పాల్గొంటారు. ప్రభుత్వ అతిథిగృహంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్సీ వర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం, 3.30 గంటలకు మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధం, పునరావాసచట్టం 2013 అమలుపై సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తారు. 16న శానిటేషన్, సీవరేజ్ పనులు, సెప్టిక్ ట్యాంక్ నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles