నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం

Thu,November 24, 2016 11:56 PM

వరంగల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. వరంగల్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో గురువారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వర్సిటీ వీసీ ఎస్సీ సత్యనారాయణ వెల్లడించారు. నందిని సిధారెడ్డితోపాటు మరో 12 మందికి డిసెంబర్ 2న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిభా పురస్కారాలను ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.


విశిష్ట పురస్కారం కింద నందిని సిధారెడ్డికి రూ.లక్ష నగదు, జ్ఞాపికతో సత్కరిస్తామని పేర్కొన్నారు. ప్రముఖ చిత్రదర్శకుడు బీ నర్సింగరావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, విద్యా విశ్లేషకులు వెలిచాల కొండల్‌రావుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ విద్యా,ఆర్థిక శాఖ కార్యదర్శులతో కూడిన కమిటీ విశిష్ట పురస్కారం కోసం డాక్టర్ నందిని సిధారెడ్డిని ఎంపిక చేసినట్టు వివరించారు. ఈ ఎంపికపై నందిని సిధారెడ్డి స్పందిస్తూ విశిష్ట పురస్కారం తెలంగాణ ఉద్యమానికి దక్కినట్టుగా భావిస్తున్నానని నమస్తే తెలంగాణకు తెలిపారు.

1797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles