పాఠకులకు వందనం


Sat,January 20, 2018 03:09 AM

Namaste Telangana Running in the Rise

ఎదుగుదలలో నమస్తే తెలంగాణ పరుగు
గణనీయంగా పెరిగిన పాఠకులు రాష్ట్రంలో మూడో స్థానం

NamastheTelangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇది తెలంగాణ విజయం! నమస్తే తెలంగాణ ఘన విజయం! ఏడేండ్లకాలంలో వడివడిగా అడుగులేసిన నమస్తే తెలంగాణ.. అసంఖ్యాక పాఠకుల ఆదరణ చూరగొంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ 31,49,000 మంది పాఠకుల చేతుల్లోకి నమస్తే తెలంగాణ పత్రిక వెళుతున్నదని ఇండియన్ రీడర్‌షిప్ సర్వే-2017 వెల్లడించింది. ఈ ఘన విజయాన్ని కట్టబెట్టిన పాఠకులకు వందనం. తెలంగాణ రాష్ట్రంలో నమస్తే తెలంగాణ మొత్తం పాఠకుల సంఖ్య 31,49,000 కాగా, ఈనాడు పత్రికకు 70.18 లక్షల పాఠకులున్నారు. 34.84 లక్షల పాఠకులతో సాక్షి పత్రిక ద్వితీయ స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రికకు తెలంగాణలో 23.49 లక్షల మంది పాఠకులు ఉన్నారని సర్వే లెక్క తేల్చింది.
Readers

దూసుకువచ్చిన నమస్తే తెలంగాణ

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా, రాష్ట్ర సాధన ఉద్యమానికి చోదకశక్తిగా 2011లో వచ్చిన నమస్తే తెలంగాణ.. అప్పటి నుంచి గణనీయంగా పాఠకుల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నది. 2012లో నమస్తే తెలంగాణకు రోజువారీ సగటు పత్రిక పాఠకులు (ఏఐఆర్) 5,06,000 ఉంటే.. 2013లో అది 5,28,000కు, 2014లో 6,60,00కు పెరిగింది. ఈ మూడేండ్లలో రోజువారీ సగటు పత్రిక పాఠకుల సంఖ్య ఏకంగా 12,43,000కు పెరిగింది. అంటే.. ఈ కాలంలో ఏడు ఎడిషన్ల పరిధిలో నమస్తే తెలంగాణ పాఠకులు 88.3 శాతం పెరిగారని ఇండియన్ రీడర్‌షిప్ సర్వే వెల్లడించింది. తెలంగాణలో ఏడు ఎడిషన్లు కలిగి ఉన్న ఈనాడు 2014తో పోల్చితే 31,77,000 మంది రోజువారీ (ఏఐఆర్) పాఠకులతో (17.8%) వృద్ధి పొందింది. సాక్షి పాఠకుల సంఖ్య 2014లో 13,12,000 ఉంటే అది తాజాగా 12,88,000కు తగ్గింది. అంటే 1.8% తగ్గుదల ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతికి పది లక్షల మంది (62.8%) రోజువారీ పాఠకులు ఉన్నారు.
NamastheTelangana3
NamastheTelangana2
NamastheTelangana1

4453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles