చట్టాలపై అవగాహన కల్పించాలి


Thu,June 20, 2019 02:19 AM

Namaste Telangana Features Editor Nagesh BReddy awarded the award

-శకుంతలా జైనీ కళా పురస్కారాల ప్రదానోత్సవంలో కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
-నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ నగేష్ బీరెడ్డికి పురస్కారం ప్రదానం

రవీంద్రభారతి: చట్టాలు, న్యాయాలు, హక్కుల గురించి సామాన్యులకు అవగాహన కల్పించా లని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో బుధవారం జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శకుంతలా జైనీ స్మారక కళా పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని.. ప్రభాకర్ జైనీ రచించిన నిఘా పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ చంద్రయ్య, బిక్కి కృష్ణ పాల్గొన్నారు.

పురస్కారాల ప్రదానం: కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్‌కు జీవనసాఫల్య పురస్కారం, నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్, చారిత్రక నవలా రచయిత నగేష్ బీరెడ్డికి శకుంతలాదేవి కళా పురస్కారం అందజేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో రాజారామ్ మోహన్‌రావు, శ్రీపాదస్వాతి, వెంకట్ గుడిపాటి, పసునూరి రవీందర్, అన్వర్, రామకవచం సాగర్, ప్రొఫెసర్ టీ విజయలక్ష్మి, పత్తిపాక మోహన్, పెద్దింటి అశోక్‌కుమార్, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్ రఫీ, చరణ్‌జానీబాషా ఉన్నారు. తర్వాత దర్శకులు యడవల్లి, నిజాం వెంకటేశం, గరిపల్లి అశోక్‌ను సత్కరించారు.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles