ఎన్నికల పోరులో వీరే విజేతలు


Fri,May 24, 2019 03:45 AM

Nama Nageswara Rao won the Khammam Lok Sabha elections

పారిశ్రామికవేత్త నుంచి పార్లమెంటుకు నామా

టీఆర్‌ఎస్ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన నామా నాగేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి గ్రామం. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన నామా.. పారిశ్రామికవేత్తగా ఎదిగారు. 2004లో టీడీపీలో చేరి ఖమ్మం నుంచి ఎంపీగా పోటీచేశారు. నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు, ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు.

వరుసగా నాలుగోసారి అసదుద్దీన్ ఒవైసీ

అసదుద్దీన్ ఒవైసీకి భార్య ఫర్హీన్ ఒవైసీ, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నిజాం కాలేజీలో బీఏ చదివారు. లండన్‌లో ఎల్‌ఎల్‌బీ, బారిస్టర్ ఇన్‌లా పూర్తిచేశారు. ఎంఐఎం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1994 నుంచి రెండుసార్లు చార్మినార్ ఎమ్మెల్యేగా, 2004 నుంచి హైదరాబాద్ ఎంపీగా విజయం సాధిస్తూనే ఉన్నారు.

6175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles