నల్సార్‌లో రెండు పీజీ డిప్ల్లొమా కోర్సులు


Wed,June 12, 2019 01:28 AM

nalsar university announces 2 new pg diploma courses

-జూలై నుంచి ప్రారంభం
శామీర్‌పేట: నేరరహిత సమాజ నిర్మాణానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ట్రూత్ ల్యాబ్ సంయుక్తంగా హైదరాబాద్‌లోని నల్సార్‌లో క్రిమినల్ లా, ఫోరెన్సిక్ సైన్స్ పీజీ డిప్లొమో కోర్సులను ప్రవేశపెట్టాయి. న్యాయవాదులు, చట్టాలు అమలుచేసే అధికారులతోపాటు పోలీస్ యంత్రాంగం, జాతీయ అంతర్గత సెక్యూరిటీ, క్రిమినల్ విచారణ పరిశోధనా సంస్థలకు, ప్రాసిక్యూటర్లకు, న్యాయమూర్తులు, జైలు అధికారులకు ఉపయోగపడేలా ఈ కోర్సులను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. లా ఉత్తీర్ణులతోపాటు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజినీరింగ్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో డిగ్రీ చదివినవారికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ జీ భవానీప్రసాద్, డాక్టర్ కేపీసీ గాంధీ, మహ్మద్, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎస్ ఉమపట్ని తదితరులు పీజీ డిప్లొమా తరగతులు బోధించనున్నారని నల్సార్ తెలిపింది. జూలై నెల నుంచి ప్రారంభం కానున్న ఈ కోర్సు పూర్తివివరాల కోసం www.nalsar.ac.inలో సంప్రదించవచ్చని సూచించింది.

307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles