లంచం ఇవ్వలేదని ఇతరులకు పట్టా


Sat,May 25, 2019 01:42 AM

Nagarkurnool Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని గోకారం మా గ్రామం. మా నాన్న కళ్లెం ఎల్లయ్య ఆయన తమ్ముళ్లు కళ్లెం రామయ్య, కళ్లెం మైబుకు సర్వే నంబర్ 153/13, 493/96లో నాలుగెకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. మా నాన్న ఎల్లయ్య 1.14 ఎకరాలు, చిన్నాన్న రామయ్య 1.13 ఎకరాలు, మరో చిన్నాన్న మైబు 1.13 ఎకరాల చొప్పున పంచుకొని వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. 1995లో మా చిన్నాన్న కళ్లెం మైబు తనకున్న 1.13 ఎకరాలను గ్రామానికి చెందిన బాదమోని నారయ్యకు అమ్ముకున్నాడు. మా నాన్న ఎల్లయ్య చనిపోవడంతో తన పేరుపై విరాసత్ చేయాలని నేను, చిన్నాన్న రామయ్య భూమిని విరాసత్ చేయాలని వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నాం. రెవెన్యూ అధికారులు మాగోడును పట్టించుకోలేదు. పొట్టకూటికోసం మేం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో మా భూమిని సైతం బాదమోని నారయ్య కుటుంబసభ్యులు ఆక్రమించుకొని మమ్మల్ని అందులోకి రానివ్వటంలేదు. 2014 నుంచి తమ భూమిని విరాసత్‌చేయాలని అధికారులకు దరఖాస్తుచేసుకుంటే అప్పటి వీఆర్వో లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో వేరే వ్యక్తికి పట్టా చేశారు. మా భూమిని అమ్మినట్లు ఎలాంటి పత్రాలు లేకున్నా అధికారులు అతనికి పట్టాచేసి మమ్మల్ని మోసం చేశారు. మా భూమిని తిరిగి మాకు పట్టా చేయాలని చారకొండ ఎమ్మార్వోకు, అప్పటి వెల్దండ ఎమ్మార్వోకు, కల్వకుర్తి ఆర్డీవోకు సైతం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
- కళ్లెం కోటయ్య, ఎల్లయ్య కుమారుడు, గోకారం

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles