తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా శంకర్


Mon,March 12, 2018 02:14 AM

N Shankar Elected as Director Union President

-సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల తేడాతో గెలుపు
CMP.jpg
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్ శంకర్ ఎన్నికయ్యారు. దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ కార్యాలయంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్ శంకర్, సానాయాదిరెడ్డి ప్యానళ్లు పోటీపడ్డాయి.ఈ పోటీలో ఎన్ శంకర్ ప్యానల్ విజయం సాధించింది. ఎన్ శంకర్ తన ప్రత్యర్థి సానాయాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శంకర్‌కు 518 ఓట్లు రాగా సానాయాదిరెడ్డికి 208 ఓట్లుపడ్డాయి. శంకర్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షులుగా ఏఎస్ రవికుమార్ చౌదరి, ఎస్ వీ భాస్కర్‌రెడ్డి గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా జీ రామ్‌ప్రసాద్, కోశాధికారిగా వై కాశీవిశ్వనాథ్, జాయింట్ సెక్రటరీలుగా కట్టా రంగారావు, ఎం ఎస్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గోపీచంద్, డీవీ రాజు ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపూడి, ప్రియదర్శిని, గంగాధర్, కృష్ణబాబు, చంద్రకాంత్‌రెడ్డి, అంజిబాబు, మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. సానా యాదిరెడ్డి ప్యానల్ నుంచి కేవలం ఈసీ సభ్యుడిగా కృష్ణమోహన్ ఒక్కరే గెలుపొందారు. తన ప్యానల్ విజయం సాధించడంపై శంకర్ హర్షం వ్యక్తంచేశారు.

తమ ప్యానల్‌పై ఎంతో నమ్మకంతో సమర్థించి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. దర్శకులకు కావాల్సిన అన్ని సౌకర్యాల్ని కల్పిస్తామని, వారి సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం పాటుపడతామని చెప్పారు. దర్శకులతో పాటు అసిస్టెంట్, అసోసియేట్ ఇలా ప్రతి సభ్యుడు సహకారంతో దేశంలో దర్శకుల సంఘాన్ని తలమానికంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దర్శకుల సంఘానికి గత వైభవాన్ని తీసుకొస్తామని జనరల్ సెక్రటరీగా ఎన్నికైన రామ్‌ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో అనిల్‌రావిపూడి, వీరశంకర్, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-సినిమాడెస్క్

1586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles