మూడ్రోజులు పొడి వాతావరణం

Mon,November 11, 2019 01:13 AM

హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, నమ స్తే తెలంగాణ: రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కోస్తా బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో కొనసాగుతున్న బుల్‌బుల్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై ఉండదని చెప్పారు.


హైదరాబాద్‌లో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గాలిలో తేమశాతం తగ్గడంతో పగలు ఎండలు మండుతూ.. ఉక్కపోత ఏర్పడుతున్నది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలిగా ఉంటుం ది. ఆదివారం ఉదయం నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles