మిసెస్ ఇండియా- 2019 రన్నరప్‌గా హైదరాబాదీ

Thu,December 5, 2019 01:57 AM

- పురస్కారాన్ని దిశకు అంకితమిచ్చిన విజేత చైతన్య పోలోజు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మిసెస్ ఇండియా 2019 పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి చైతన్య పోలోజు.. తనకు దక్కిన పురస్కారాన్ని దిశకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం రాత్రి అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మహిళ ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉన్నా.. దిశ ఘటన తన మనసును బాధించిందని చెప్పారు. బంజారా మహిళా ఎన్జీవో, డాక్టర్ ఆనంద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో చైతన్య తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు.

387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles