వాయిదాపడిన 18 మండలాల్లో 15న ఎంపీపీ ఎన్నికలు


Wed,June 12, 2019 01:39 AM

mpp elections in 18 mandals at june 15th

-నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 18 మండలాల్లో ఇటీవల వివిధ కారణాలతో వాయిదాపడిన కో-ఆప్షన్, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ఈ నెల 15న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిషత్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నెల ఏడున ప్రత్యేక సమావేశాల ద్వారా ఎం పీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలోని 32 గ్రామీణ జిల్లా పరిషత్‌లలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తిచేశారు. 18 మం డల ప్రజాపరిషత్తుల్లో కోరం లేకపోవడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోలేదు. ఈ 18 మండలాల్లోని పదవులకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీచేశారు.

ఈ సందర్భంగా ఎన్నికయ్యే పాలకమండళ్ల పదవీకాలం ఏ తేదీ నుంచి మొదలవుతుందన్న విషయాన్ని ఎస్‌ఈసీ విడిగా నోటీఫై చేస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, సారంగాపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆలపల్లి, ముల్కలపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవీపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని టెక్కల్, సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి, నల్లగొండ జిల్లాలోని చందంపేట, కేతేపల్లి, నేరేడుగొమ్ము, సూర్యాపేట జిల్లాలోని చిల్కూరు, రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్, మాడుగుల, జనగామ జిల్లాలోని తరిగొప్పుల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిషత్‌ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి సంబంధించి సంబంధిత మండలాల గెజిటెడ్ అధికారులు 14వ తేదీలోగా నోటీసులు జారీచేయాలని సూచించారు. ఈ మండలాల్లో ఉదయం 9-10 గంటల మధ్య కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక తర్వాత మ ధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. ఏదైనా కారణాలతో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించలేకపోతే ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు కూడా నిర్వహించరాదని, దీనిపై ఎస్‌ఈసీకి నివేదించాలని పేర్కొన్నారు.

496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles