కీసర రిజర్వు ఫారెస్ట్‌కు మహర్దశ!


Sat,September 14, 2019 01:26 AM

MP Santosh Crosses 6 Crore Mark in Green Challenge

- రూ.ఆరు కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు.. నేడు కలెక్టర్ పరిశీలన

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర రిజర్వు ఫారెస్ట్‌లో రూ.ఆరు కోట్లతో అభివృద్ధి పనులకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్ రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 31న రిజర్వు ఫారెస్ట్‌ను సందర్శించి విద్యార్థులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుమారు 15 వేల మొక్కలనునాటిన ఎంపీ సంతోష్‌కుమార్.. తొలివిడుతలో రూ.మూడు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వు ఫారెస్ట్ చుట్టూ ఫెన్సింగ్, ఎకో టూరిజం పార్కు, అర్బన్ లంగ్ స్పేస్ పార్కుల ఏర్పాటు, కీసర పెద్దమ్మ చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చడం తదితర 24 రకాల అభివృద్ధి పనులకు జిల్లా అటవీశాఖ అధికారులు సుమారు రూ.ఆరు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. పనులపై రూపొందించిన నివేదికను అధికారులు శనివారం కలెక్టర్‌కు అందించనున్నట్టు తెలిసింది. వీటికి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలువాలని అధికారులు భావిస్తున్నారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles