కవితకు మరో అరుదైన గౌరవం


Sun,February 17, 2019 03:06 AM

MP Kavitha to address Gender Equality Summit on March 1

-మార్చి ఒకటిన ఐరాస నిర్వహించే జీఈఎస్‌లో ప్రసంగించనున్న ఎంపీ
-సుస్థిర అభివృద్ధి, లింగ సమానత్వంకోసం చేస్తున్న కృషికిగాను సమ్మిట్‌కు ఎంపిక

హైదరాబాద్/నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ.. గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా ఆధ్వర్యంలో మార్చి ఒకటిన ఢిల్లీలో నిర్వహించే లింగ సమానత్వ సదస్సు (జీఈఎస్-2019)లో ప్రసంగించాల్సిందిగా ఎంపీ కవితను నిర్వాహకులు ఆహ్వానించారు. లింగ సమానత్వం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి, సదస్సుకు ఆమెను ఎంపికచేశారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత అవార్డు సొంతం చేసుకోవడంతో నిజామాబాద్ పేరు దేశస్థాయిలో మార్మోగింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆమెకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమం ఉంటుం ది. తాజాగా కవితకు మరో గౌరవం లభించడం పట్ల నిజామాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచే క్రమంలో అహర్నిశలు పాటుపడుతున్న ఎంపీ కవిత నాయకత్వంలో ఇందూరుకు జాతీయస్థాయిలో గౌరవం దక్కుతున్నదని కొనియాడుతున్నారు. ఐక్యరాజ్య సమితి సమ్మిట్ నాలెడ్జ్ భాగస్వామి డెలాయిట్‌తో కలిసి నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధంచేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రదానంచేసే పద్ధతులపై ఎంపీ కవిత చర్చిస్తారు.

నాలుగో పారిశ్రామిక విప్లవం కారణంగా వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్, బిగ్‌డాటాలలో మానవ-డిజిటల్ ఇంటర్‌ఫేస్ పాత్ర పెరిగింది. దీనివల్ల మనదేశంలోనూ యువత ఆయారంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తప్పనిసరైంది. ఉపాధిపరంగా, నైపుణ్యం సముపార్జనలోనూ అవకాశాలు తక్కువగా ఉండే మహిళలు.. ఆయారంగాల్లో పురోగమించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికంగా పట్టుసాధించడం, పని ప్రదేశాల్లో సానుకూల వాతావరణం సృష్టించడం, విద్యావిధాన మార్పులు వంటి అంశాలపై ఎంపీ కవిత ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ అధికారులు, అకాడమీలు, పౌర సమాజ సంస్థలు, ఎన్జీవోలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఎక్స్‌వో, సీహెచ్‌ఆర్వోస్, చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్లు, పాలసీ మేకర్లు, సీఎస్‌ఆర్ మేనేజర్లు, ప్రాక్టీషనర్లు, కార్పొరేట్ కమ్యూనికేషన్ అధిపతులు జీఈఎస్-2019 సదస్సులో బ్లూప్రింట్‌ను రూపొందిస్తారు. మన దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలను బాధ్యతాయుత వ్యాపార విధానాలతో బలోపేతం చేయటానికి కలిసికట్టుగా పనిచేసే వేదికగా ఐక్యరాజ్యసమితి గ్లోబ ల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా వ్యవహరిస్తున్నాయి.

ఎంపీ కవితను ఆహ్వానించిన కేరళ అసెంబ్లీ స్పీకర్

దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతోఈ నెల 23 నుంచి 25 వరకు కేరళ అసెంబ్లీ నిర్వహించే సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఎంపీ కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కేరళ అసెంబ్లీ డైమెండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 23న ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు.

2861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles