ఎంపీ కవిత కృషితో తప్పిన జైలుశిక్ష

Tue,March 21, 2017 01:53 AM

-ఇరాక్‌లో చిక్కుకున్న యువకుడికి విముక్తి

Sagar
నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ మోసంతో జైలుకెళ్లాల్సిన ఓ యువకుడు, నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో క్షేమంగా ఇంటికి చేరాడు. సోమవారం నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ఆచారి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన దార్వాడ్ సాగర్ గత ఏడాది సెప్టెంబర్‌లో గల్ఫ్ ఏజెంట్ విజయ్‌కుమార్ ద్వారా విజిట్ వీసాపై ఇరాక్ వెళ్లాడు. అక్కడి ఏజెంట్ చిన్నయ్య సాగర్‌కు పని కల్పించా ల్సి ఉండగా పట్టించుకోలేదు. దీంతో సాగర్ కొన్నిరోజులు బగ్దాద్‌లో పనిచేశాడు. ఏబ్రిల్ పట్టణంలో ఎక్కువగా వేతనం వస్తుందనే ఉద్దేశంతో నకిలీ వీసా తో వెళ్లి కొన్నిరోజులు పనిచేశాడు. ఇటీవల పోలీసులకు చిక్కగా, 250 కిలోమీటర్ల దూరం ఉన్న బాగ్దాద్‌కు తరలిస్తుండగా ఈ విషయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవితకు వాట్సప్‌లో వివరించాడు. స్పందించిన ఎంపీ ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయంతో గత ఫిబ్రవరి 10న చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏబ్రిల్ జైలు శిక్ష తప్పదని అక్కడి అధికారులు స్పష్టంచేశారు. వెంటనే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు విన్నవించి సాగర్‌ను రాయబార కార్యాలయంలో ఉంచి స్వగ్రామానికి రప్పించే వరకు ఏర్పాట్లుచేశారు. ఎట్టకేలకు ఈ నెల 17న సాగర్ ఇంటికి చేరాడు. విజిట్ వీసా గడువు కూడా ముగియడంతో జాగృతి గల్ఫ్ సమా ఖ్య ఆధ్వర్యంలో సాగర్‌కు ఆశ్రయం కల్పించామని నవీన్‌ఆచారి తెలిపారు.

952

More News

మరిన్ని వార్తలు...