తల్లి చేతిలో తనయుడు హతం


Wed,June 12, 2019 01:19 AM

mother killed her son

-మద్యం తాగి వేధిస్తుండగా రోకలి బండతో మోదిన తల్లి
-సూర్యాపేట జిల్లాలో ఘటన
గరిడేపల్లి: మద్యం తాగొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్న కొడుకును తల్లి రోకలిబండతో దాడిచేయడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండ లం సుభాష్‌నగర్‌లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బెజ్జం సతీశ్ అలియాస్ చంటి (27) మద్యానికి బానిసై తల్లి మరియమ్మను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కూడా మద్యం తాగొచ్చి డబ్బుల కోసం వేధిస్తుండగా తల్లి రోకలిబండతో దాడి చేసిం ది. దీంతో అతడికి గాయాలయ్యాయి. గాయాలతోనే సతీశ్ ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారుజామున చూసే సరికి తీవ్రరక్తస్రావంతో మృతి చెందాడు. సతీశ్ భార్య శిల్ప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles