ఏండ్లనాటి కల సాకారం..


Wed,June 12, 2019 01:36 AM

mla RAVI SHANKAR solves land dispute issue

-కోనాపూర్‌లో 24 ఏండ్లుగా 53మంది భూపోరాటం
-టీడీపీ హయాంలో పట్టాలిచ్చినా స్థలాలు చూపని వైనం
-ఎమ్మెల్యే రవిశంకర్ చొరవతో సమస్య పరిష్కారం
-నేడు ఇండ్ల స్థలాల వద్ద భూమి పూజ.. ఆనందంలో లబ్ధిదారులు
కొడిమ్యాల: ఇండ్ల స్థలాల కోసం 24 ఏండ్లుగా పోరాడుతున్న నిరుపేదల కల బుధవారం సాకారం కానున్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్‌లో కొడిమ్యాల-సూరంపేట రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 138లో 1995లో టీడీపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇండ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు జారీ చేసింది. కోనాపూర్‌లో ఇండ్లులేని నిరుపేదలను గుర్తించి పట్టాలు ఇచ్చిన అప్పటి అధికారులు, వారికి స్థలాలు మాత్రం కేటాయించలేదు. 24 ఏండ్లుగా 53మంది లబ్ధిదారులు స్థలాల కోసం కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వారి సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.

తమ సమస్యను పరిష్కరించాలని ఇటీవల బాధితులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కలిశారు. వెంటనే ఆయన జగిత్యాల కలెక్టర్ శరత్‌తో ఫోన్లో మాట్లాడగా ఆయన స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇటీవలే 53 మందికి 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలకు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయగా, ఎమ్మెల్యే రవిశంకర్ సదరు ఇండ్ల స్థలాల వద్ద బుధవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టనున్నారు. దీంతో ఇన్నేండ్లుగా పరిష్కారం కాని సమస్య టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ చొరవతో తమ కల సాకారమవుతుందంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles