తాళికట్టే వేళ తనువు చాలించాడు

Mon,November 11, 2019 02:37 AM

-నాలుగు గంటల్లో పెండ్లనగా వరుడి ఆత్మహత్య
-ఫంక్షన్‌హాల్‌లోనే ఉరేసుకొని బలవన్మరణం
-మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఘటన

పేట్‌బషీరాబాద్: మూడుముళ్ల బంధానికి మరో నాలుగు గంటలే మిగిలి ఉండగా పెండ్లి కొడు కు ఆత్మహత్య చేసుకున్నాడు. పెండ్లి పీటలెక్కాల్సిన సమయంలో ఫంక్షన్‌హాల్‌లోనే ఉరి పోసుకున్నాడు. పెండ్లి కూతురితో ఏడడుగులు నడిచి దాంపత్య జీవితానికి నాంది పలుకుతాడనుకున్న వేళ.. తన జీవితాన్నే చాలించాడు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు పెండ్లి జరుగాల్సి ఉండగా, నాలుగు గంటల ముందు ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకున్నది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన నక్కెర్తి శ్రీనివాస్‌చారి ఒక్కగానొక్క కుమారు డు సందీప్(24). తల్లి పద్మజారాణి 16 ఏండ్ల కింద మృతిచెందగా.. శ్రీనివాస్‌చారి మరో వివాహం చేసుకున్నారు.

అప్పటినుంచి సందీ ప్ సరూర్‌నగర్‌లోని అమ్మమ్మ తాత వసంత, జంగేశ్వరరావు వద్ద ఉంటూ బీటెక్ పూర్తిచేశా డు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వద్దకు వెళ్లేందుకు సందీప్ ఇష్టపడేవాడు కాదు. కానీ, శ్రీనివాస్‌చారి.. సందీప్‌ను ఒప్పించి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో వివాహం కుదిర్చారు. గత నెలలో తాత జంగేశ్వరరావు మృతిచెందడంతో సందీప్ మానసికంగా కుంగిపోయాడు. తనకు పెండ్లి ఇష్టంలేదని నిత్యం ఇంట్లో అం టుండేవాడని స్థానికులు చెప్తున్నారు. ఆదివా రం ఉదయం పెండ్లి ఉండగా, శనివారం రాత్రి కుటుంబసభ్యులంతా వివాహం జరుగాల్సిన కొంపల్లిలోని ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటలకు స్నేహితులు రాహు ల్, శశాంక్, బంధువులతో కలిసి సందీప్ ఫంక్షన్‌హాల్‌కు వచ్చాడు.

అంతా కలిసి ఒకే గదిలో పడుకోవాలని భావించినా.. చివరకు సందీప్ మరో గదిలో పడుకుంటానని వెళ్లాడు. ఆదివా రం ఉదయం 7:30 గంటలకు స్నేహితులు, బంధువులు ఎంత పిలిచినా సందీప్ తలుపు తీయలేదు. మాస్టర్ కీతో తలుపులు తీయగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. అప్పుడప్పుడే పెండ్లికి వస్తున్న బం ధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించా రు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. సందీప్ మృతిపై అనుమానాలున్నట్టు తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అత్తలు శారద, మాధవి, బంధువులు శశాంక్, నాగరాజు.. ఆత్మహత్యకు పాల్పడేలా సందీప్‌ను ప్రేరేపించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles