డిసెంబర్‌కు పశువీర్యోత్పత్తి కేంద్రం పూర్తి


Sat,September 14, 2019 02:01 AM

Ministers Talasani Srinivas Yadav Inspects Construction of frozen Semen Bull Station at kamsanipally

- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడి

షాద్‌నగర్, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లిలో రూ.16 కోట్లతో నిర్మిస్తున్న ఘనీకృత పశువీర్యోత్పత్తి కేంద్రం ఈ ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం కేంద్రం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తెలంగాణ పాడి రైతులకు నాణ్యమైన పశుసంపదను అందజేయాలనే ఉద్దేశంతో వీర్యోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహం త్వరలోనే పాడిరైతులకు చేరుతుందని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వారికి అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. చేపలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ భారీ మొత్తంలో రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పశు వీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరీశ్, పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

71
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles