నిమ్స్‌లో మెరుగైన వైద్యసేవలు

Mon,November 11, 2019 01:28 AM

- ప్రజలంతా వినియోగించుకోవాలి: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిమ్స్‌లో తక్కు వఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, ప్రజలందరూ వినియోగించుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్మర్‌పల్లి జెడ్పీటీసీ పెరుమాళ్ల రాధతోపాటు పలువురు కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులను మంత్రి ఆదివారం పరామర్శించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, ఆర్‌ఎంవో డాక్టర్‌ హేమంత్‌, నెఫ్రాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తాడూరి గంగాధర్‌ ద్వారా రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం డయాలసిస్‌ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఇక్కడికి వస్తున్న రోగుల్లో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉంటున్నారని, వారికోసం గతంలో 10 డ యాలసిస్‌ మిషన్లు ఉండేవని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌.. డయాలసిస్‌ యంత్రాల సంఖ్యను 60కి పెంచారని ఆయన అన్నారు.

224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles