పర్యావరణంతోనే మానవ మనుగడ

Sat,November 23, 2019 02:19 AM

-సమాజాభివృద్ధి.. ప్రకృతి వినాశానికి దారితీయొద్దు
-అభివృద్ధి నమూనాలో తెలంగాణే నంబర్‌వన్
-ఎన్విరాన్‌మెంటల్ డీగ్రేడేషన్ సదస్సులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నానాటికి క్షీణించిపోతున్న పర్యావరణంతో మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉన్నదని ఆబ్కా రీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సమా జం అభివృద్ధి ప్రకృతి వినాశానికి దారితీయకూడదని సూచించారు. ఖైరతాబాద్‌లోని ఇం జినీర్స్ భవన్‌లో ఎన్విరాన్‌మెంటల్ డీగ్రేడేషన్ అంశంపై మూడురోజులపాటు జరిగే సదస్సును శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకూ స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం దొరుకడం కష్టంగా మారుతున్నదన్నారు.

ఢిల్లీలో వాయు కాలు ష్యం పెరిగిపోయి ఆక్సిజన్ రెస్టారెంట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకొంటున్నారని, 70 ఏండ్లు గా ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మారుమూల పల్లెకు కూడా తాగునీరు అంది స్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. మున్సిపల్ మంత్రిగా కే తారకరామారావు బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు. అన్ని గ్రామా లు, పట్టణాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా 30 రోజుల ప్రణాళికను అమలుచేసి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని ప్రశంసించారు.

అభివృద్ధి నమూనాలో తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్‌గా నిలిచిందని సంతోషం వ్యక్తంచేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ సెంటర్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ దానకిశోర్, ఫెలోషిప్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఎఫ్‌ఐఈ) చైర్మన్ వేలన్, కోచైర్మన్ హనుమంతాచారి, మాజీ ప్రెసిడెంట్ శిశిర్‌కుమార్ బెనర్జీ, టోక్యో ప్రతినిధి టకయూకీ సవాయ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ సెంటర్ చైర్మన్ రామేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles