శ్రీవారిసేవలో మంత్రి సత్యవతి

Mon,November 11, 2019 01:26 AM

తిరుమల, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదివారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించారు. ఆలయ అధికారులు పట్టు వస్ర్తాలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబసభ్యులతో సహా స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు వెల్లడించారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles