అందరికీ నాణ్యమైన విద్య


Thu,September 12, 2019 03:20 AM

Minister Sabitha Indra Reddy Review Meeting with Education Officers

-విద్యాశాఖ అధికారులతో భేటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
-క్యాబినెట్‌లో చోటుదక్కడం అదృష్టమని వ్యాఖ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అందుకు అధికారులంతా సహకరించాలని కోరారు. బుధవారం హైదరాబాద్ ఎస్సీఈఆర్టీ ఆవరణలోని సైమ్యాట్ భవనంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల్లో స్వచ్ఛ విద్యాలయాల పేరిట 30 రోజుల ప్రణాళికను అమలుపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఏ అశోక్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చేవారు పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు, డిక్షనరీలు తీసుకురావాలని కోరగా, ఒక్క రోజులోనే 35 వేల నోటుపుస్తకాలు అందాయని తెలిపా రు. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఈ-మ్యాగజైన్ ఎడ్యుసర్ పత్రికను సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.

బడులను దత్తత తీసుకోండి

మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను స్థానిక ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోవాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు. సీమ్యాట్ భవనంలో ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. క్యాబినెట్‌లో చోటుకల్పించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అంతకుముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల సమాఖ్య ప్రతినిధులు కలిసి సన్మానించారు.

328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles