మెరుగ్గా ఆర్టీసీ సేవలు


Thu,September 12, 2019 03:18 AM

Minister Puvvada Ajay Kumar review with rtc officials

ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ ఆదాయం పెంచుకొనేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు సూచించారు. ప్రయాణికుల ఆదరణ చూరగొనడానికి సేవలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉన్నదన్నారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి అజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన సమావేశంలో సంస్థాగత అంశాలను లోతుగా సమీక్షించారు. సంస్థ స్వరూపం, బస్సుల నిర్వహణలతోపాటు పలు అంశాలను అడిగి తెలుసుకొన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఆర్థికలోటును పూడ్చుకోవడానికి వాణిజ్యపరంగా వచ్చే ఆదాయ మార్గాలను నిశితంగా పరిశీలించాలన్నారు. నగరంలో 37 శాతం సర్వీసులు నడుస్తున్నాయని, నష్టాలు వస్తున్నప్పటికీ మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు. సమ్మె నోటీ సు, ప్రభుత్వంలో సంస్థ విలీనం, యూనియన్ల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఎం వాలెట్ సేవలు మెరుగు

అనంతరం రవాణాశాఖ అధికారులతో పలు అంశాలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్షించారు. రవాణాశాఖ సమకూర్చుకొంటున్న ఆదాయం, విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రవాణాశాఖలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానంతోపాటు ఎం వాలెట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో రవాణాశాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మతోపాటు ఈడీలు పురుషోత్తం, టీవీరావు, యా దగిరి, రవాణాశాఖ జాయింట్ కమిషనర్లు రమేశ్, పాండురంగానాయక్, డీటీసీ కే పాపారావు పాల్గొన్నారు.

323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles