- లబ్ధిదారుల వద్దకు వెళ్లి చెక్కులు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, నమస్తే తెలంగాణ: పేదింటి ఆడపిల్ల పెండ్లి ఆ కుటుంబానికి భారంగా మారకూడదన్న దృఢ సంకల్పంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నారని రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం మేయర్ పాపాలాల్‌తో కలిసి మంత్రి బైక్‌పై ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు రూ.82.60 లక్షల విలువైన 82 చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రికి మిఠాయిలు తినిపించి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.