నిరుపేదల సొంతింటి కల సాకారం

Fri,November 8, 2019 02:15 AM

-ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-గోనెపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లోకి ప్రవేశాలు

సిద్దిపేట కలెక్టరేట్, నమస్తేతెలంగాణ: నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, రూపాయి ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రభుత్వం కట్టించి ఇస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో లబ్ధిదారులచే 30 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లోకి గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా వారికి మిఠాయిలు తినిపించారు. ఇండ్లు ఎలా ఉన్నాయని ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుపేదలు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లోకి చేరుకోవడంతో సీఎం కేసీఆర్ కల నెరవేరిందన్నారు.

హైదరాబాద్‌లో ఉండే అపార్ట్‌మెంట్ల మాదిరిగా గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం సంతోషంగా ఉన్నదన్నారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో, చిరునవ్వుతో బతుకాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. పైసా ఖర్చు లేకుండా నల్లా, కరెంట్, రోడ్డు సౌకర్యంతోపాటు మురికి కాల్వలు నిర్మించి అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లను ఇస్తున్నందున పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles