ఇంటింటికీ వెళ్లండి.. పథకాలను వివరించండి


Tue,September 11, 2018 12:15 AM

Minister Harish Rao at TRS Chief Leaders Meet

-టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఏర్పాటుచేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని చెప్పారు. బూత్‌స్థా యి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసేవిధంగా కృషిచేయాలని కో రారు. కుటుంబసభ్యుడిగా నిరంతరం ప్రజాసేవలో అందుబాటులో ఉండి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివ రిద్దామని శ్రేణులకు సూచించారు. ఈనెల 25 వరకు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నిక ల కమిషన్ కల్పించిందని, 18 ఏండ్లు నిండినవారిని ఓటరుగా నమోదుచేయించాలని చెప్పారు.

789
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS