మేడారం.. జనసంద్రం

Fri,February 22, 2019 02:14 AM

-భారీగా తరలివచ్చిన భక్తులు
-వనదేవతలను దర్శించుకున్న ములుగు ఇంచార్జి ఎస్పీ భాస్కరన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీ

ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మినీ మేడారం జాతర రెండోరోజైన గురువారం భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనేందుకు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మేడా రం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు మొక్కు లు చెల్లించుకొని కానుకలు సమర్పించారు. గిరిజన పూజారులు బుధవారం మండమెలిగే పండుగను నిర్వహించి తెల్లవారుజామువరకు జాగరణ చేసి తల్లులకు పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తుల సందర్శనకు అనుమతించారు. రాత్రింబవళ్లు తేడా లేకుం డా భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో మేడా రం పరిసరాలు జనసంద్రంగా మారాయి.

medaram2
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం (బంగారం), నూతన వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా ఇంచార్జి ఎస్పీ ఆర్ భాస్కరన్ వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్య కుటుంబసమేతంగా దేవతలను దర్శించుకున్నారు. వీరికి ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయ ప్రకారం డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు.

1108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles