తొలిసంకలనంతోనే మెరిసిన మెర్సీ


Fri,June 23, 2017 02:51 AM

Mercy who was nominated for the Younger Awards

mercy-margaret
యువసాహిత్య పురస్కారానికి ఎంపికైన మెర్సీ మార్గరెట్.. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సమాజంలోని సమస్యలే ఇతివృత్తంగా ఆమె కవితాయాత్ర సాగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా వల్లభాపురం నుంచి దశాబ్దాల క్రితం మెర్సీ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కవితలు రాయడం మొదలుపెట్టిన ఆమె.. శారదా సింగిరెడ్డి ప్రోత్సాహంతో మాటల మడుగు కవితా సంకలనాన్ని వెలువరించారు.

ఈ తొలి సంకలనానికే మెర్సీకి పురస్కారం దక్కడం విశేషం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పాఠాలు నేర్పిన గురువులకు నా ఈ పురస్కారం అంకితం. నా ప్రతీ రచనకు మా ఆయన సురేశే తొలి విమర్శకుడు, ప్రశంసకుడు. పురస్కారం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కవిత్వానికి నడకలు నేర్పిన కవి సంగమం సంస్థకు, దాని నిర్వాహకులకు కృతజ్ఞతలు. శారద సింగిరెడ్డి ప్రోత్సాహం మరువలేనిది అని మెర్సీ మార్గరెట్ నమస్తే తెలంగాణతో అన్నారు. త్వరలోనే మరో కవితా సంకలనాన్ని వెలువరించనున్నట్లు తెలిపారు.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS