58 మంది అధికారులకు మెమోలు


Thu,September 12, 2019 02:45 AM

Memos to 58 officers

-ప్రత్యేకాధికారిపై సస్పెన్షన్ వేటు
-కొరఢా ఝళిపించిన రాజన్నసిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ : 30 రోజుల ప్రణాళికపై నిర్లక్ష్యం ప్రదర్శించిన 58 మంది అధికారులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కొరఢా ఝలిపించారు. బుధవారం కలెక్టర్ గ్రామాలప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కోనరావుపేట మండలం మంగలపల్లి ప్రత్యేక అధికారి ఆర్ రాజగోపాల్‌ను సస్పెండ్ చేయడంతోపాటు మరో 58 మం ది అధికారులకు మోమోలు జారీ చేశారు. మెమోలు జారీ చేసిన అధికారుల్లో గంభీరావుపేట, వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల ఎంపీడీవోలు ఉండటం గమనార్హం.

-దాసర్లపల్లి కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
కందుకూరు: పల్లెల ప్రగతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 30 రోజుల ప్రణాళికలో నిర్లక్ష్యం చేసిన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ లం దాసర్లపల్లి గ్రామ కార్యదర్శిపై ఇంచార్జి కలెక్టర్ హరీశ్ సస్పెన్షన్ వేటు వేశారు. దాసర్లపల్లి కార్యదర్శి చంద్రయ్య, కందుకూరు పంచాయతీ ఇంచార్జి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. బుధవారం జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ఆయా గ్రామాలను తనిఖీచేయగా పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య కార్యాచరణ ప్రణాళికలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యదర్శిని సస్పెండ్‌చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు.

106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles