పలు రైళ్లు పాక్షికంగా రద్దు


Wed,June 12, 2019 01:12 AM

Many trains partially canceled

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మరమ్మతు పనులు కొనసాగుతున్నందున పలు రైళ్లు పాక్షికంగా రద్దుచేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. బోధన్- మహబూబ్‌నగర్ ప్యాసింజర్‌ను షాద్‌నగర్ నుంచి మహబూబ్‌నగర్ స్టేషన్ల మధ్య బుధవారం (జూన్ 12) నుంచి ఆగస్టు 12 వరకు పాక్షికంగా రద్దుచేశారు. కాచిగూడ- మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును షాద్‌నగర్ నుంచి మహబూబ్‌నగర్ మధ్య ఆగస్టు 12 వరకు, కాచిగూడ- మేడ్చల్ ప్యాసిజర్ రైలును బొల్లారం- మేడ్చల్ మధ్య ఆగస్టు 10 వరకు పాక్షికంగా రద్దుచేశారు. ఫలక్‌నుమా- లింగంపల్లి, ఫలక్‌నుమా- హైదరాబాద్ మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు రద్దుచేసినట్టు తెలిపారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles