తెలుగు భాషలో అద్భుత సాహిత్యం


Wed,August 14, 2019 01:24 AM

Mana Cinemalu Book Launch by Pawan Kalyan

- మన సినిమాలు పుస్తకావిష్కరణలో పవన్‌కల్యాణ్
తెలుగుభాషలో ఉన్న అద్భుత సాహిత్యంతో ఎన్నో గొప్ప సినిమాలు తీయొచ్చని, ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయగల సత్తా తెలుగు సాహిత్యానికి ఉన్నదని జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. తెలంగాణ తన గుండెల్లో, రక్తంలో ఉన్నదని, రాజకీయాల కోసం కాకుండా ఇష్టంతో తెలంగాణ గురించి మాట్లాడుతానని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి సంపాదకులుగా వ్యవహరించిన మన సినిమాలు అనుభవాలు- చరిత్ర- పరిణామం అనే పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు, సుద్దాల అశోక్ తేజ, రెంటాల జయదేవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- సినిమా డెస్క్

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles