పట్టపగలే..


Tue,April 16, 2019 01:22 AM

man with axe Attempt to murder

-జగిత్యాలలో గొడ్డలితో వ్యక్తిపై హత్యాయత్నం
-స్వల్ప గాయాలతో బయటపడ్డ బాధితుడు

జగిత్యాల క్రైం: పట్టపగలే నడి వీధిలో ఓ వ్యక్తి గొడ్డలితో మరోవ్యక్తిపై దాడిచేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కత్తురోజు లక్ష్మణ్ ఐదేండ్ల క్రితం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని కొన్నాడు. ఇందుకు జగిత్యాలకు చెందిన తిప్పర్తి కిషన్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఆ స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడువలు మొదలుగా కాగా అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో కిషన్‌పై కోపం పెంచుకున్న లక్ష్మణ్ సోమవారం జిల్లా కేంద్రంలోని సార్గమ్మ వీధిలో కాపు కాసి.. అతడిపై గొడ్డలితో దాడి చేశాడు. అందరు చూస్తుండగానే పలుమార్లు చేతులు, తల, పొట్టపై దాడిచేశాడు. గాయాలతో కిందపడిపోయిన కిషన్‌ను స్థానికులు జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కిషన్ భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ ప్రకాశ్ తెలిపారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles