ఆరుబయటకు వెళ్లారని..


Thu,September 12, 2019 02:25 AM

man fined for Excretion of feces outside

ధర్మపురి,నమస్తేతెలంగాణ: ఆరుబయట మలవిసర్జన చేసిన వ్యక్తికి అధికారులు రూ.500 జరిమానా విధించిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరుబయట మలవిసర్జన చేయరాదని గ్రామస్థులు ప్రమాణం చేశారు. బుధవారం భూమయ్య అనే వ్యక్తి ఆరుబయట మలవిసర్జన చేయగా గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకాధికారి సతీశ్, కార్యదర్శి మల్లేశంలు భూమయ్యను పిలిపించి రూ.500 జరిమానా విధించారు. కోటపల్లి మండలం జనగామకు చెందిన తగరం రాజు ఆరుబయట మలవిసర్జనకు వెళ్ళినందుకు రూ.500 జరిమానా విధించి చెంబురాజు బిరుదును ప్రదానం చేశారు.

496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles