భార్య, అత్తపై గొడ్డలితో దాడి


Thu,May 16, 2019 01:35 AM

man attacked on his wife and  mother in law

-అత్త మృతి, భార్య పరిస్థితి విషమం
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్‌లో ఓ వ్యక్తి భార్య, అత్తపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. అత్త అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. చెన్నాపూర్‌కు చెందిన ప్రభాకర్, సుజాత భార్యాభర్తలు. ప్రభాకర్ కొంత కాలంగా భార్యను అనుమానంతో వేధించేవాడు. సుజాత వారం క్రితం అదే గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. రెండ్రోజుల క్రితం ప్రభాకర్ భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రభాకర్ బుధవారం అత్త ఇంటికి వెళ్లి అత్త లక్ష్మి, భార్య సుజాతపై గొడ్డలితో దాడిచేశాడు. అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా ప్రభాకర్ పరారయ్యాడు. గాయపడిన లక్ష్మి (65) అక్కడికక్కడే మృతిచెందింది. సుజాతను ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిరాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles