హైదరాబాదీలు.. జాగ్రత్తలు తీసుకోండి


Thu,September 12, 2019 03:05 AM

Mahesh Babu Supports Minister KTR Over Dengue Awareness Campaign

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన హీరో మహేశ్‌బాబు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం చేసిన ట్వీట్‌కు సినీనటుడు మహేశ్‌బాబు స్పందించారు. హైదరాబాద్‌లో డెంగీ, వైరల్ జ్వరం అంటువ్యాధిగా మారింది. ప్రజలు తమ ఇంటి ప్రాంగణం, చుట్టుపక్కల నీటినిల్వలు లేకుండా మరింత అప్రమత్తంగా ఉంటూ.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అని మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
prince-Maheshbabu

165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles