వలసపోతే.. భూమే పోయింది!


Wed,May 22, 2019 01:44 AM

Mahabubabad district Farmer suffering for Pattadar Passbook

-అధికారులను కలిసినా ఫలితంలేదు.. వీఆర్వో పట్టించుకోవడంలేదు
-ధర్మగంటను ఆశ్రయించిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వల్లెపు శ్రీనివాస్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తాత, నాన్నల నుంచి వారసత్వంగావచ్చిన 20 గుంటల భూమిని సాగుచేసుకుంటున్న ఆ రైతు బతుకుదెరువు కోసం పట్టణానికి వలసవెళ్లాడు. అదే శాపమైంది. మళ్లీ తిరిగి వచ్చిన తాను ఆ భూమిలో అడుగుపెట్టబోతే.. ఇతరులు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు సమస్యను విన్నవిస్తే.. పట్టించుకునేవారేలేరు. చివరకు బాధితుడు ధర్మగంటను ఆశ్రయించాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన వల్లెపు శ్రీనివాస్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఇంటికన్నె గ్రామంలోని 368/1 సర్వే నంబర్‌లో 20 గుంట ల భూమి తండ్రి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. ఈ భూమిని నా తండ్రి, నేను ఎవ్వరికీ విక్రయించలేదు. పహాణీ, ఈసీల్లో కూడా మా పేరే నేటికీ ఉన్నది. కొన్నాళ్ల క్రితం హన్మకొండకు వలసవెళ్లాం. మేం తిరిగి వచ్చిన తర్వాత మా భూమి మీదకు వెళ్తే.. కొందరువ్యక్తులు అడ్డగించా రు.

దీంతో పోలీసులకు ఫిర్యాదుచేశాను. తాసిల్దార్ కార్యాలయం నుంచి అనుమతి ఉంటేనే ఆ భూమిని ముట్టుకోవాలని పోలీసులు చెప్తున్నారు. దీంతో, 2017లో ఆర్డీవోకు సమస్యను వివరించాను. ఆయన వెంటనే వీఆర్వోను పిలిచి సమస్యను పరిష్కరించమన్నారు. కానీ, వీఆర్వో పట్టించుకోవడంలేదు. ఏడాది తర్వాత మళ్లీ ఎమ్మార్వోను కలిశాను. ఆయన మళ్లీ ఆ వీఆర్వోకే అప్పజెప్పారు. వీఆర్వో కాలయాపన చేస్తున్నారే తప్ప.. సమస్యను పరిష్కరించడం లేదు. అది నా సొంతభూమి.. బతుకుదెరువు కోసం ఆ రోజు మేం హన్మకొండకు వెళ్లకుండాఉంటే.. కుటుంబం వీధినపడాల్సివచ్చేది. గ్రామం లో లేకపోవడంవల్ల ఈ పొలాన్ని సాగుచేయకపోయాను. నా భూమిపై నాకే యాజమాన్యహక్కులుంటాయి కదా! నా సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles