సతాయిస్తున్నరు


Sat,May 25, 2019 01:32 AM

Machareddy Mandal Farmers Suffering Revenue Officers Neglect For Land Registration

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ (ఎం) గ్రామానికి చెందిన బింగి సత్యనారాయణ కొత్త పాస్‌బుక్ కోసం అధికారుల చుట్టూ తిరుగలేక నరకయాతన అనుభవిస్తున్నారు. సత్యనారాయణకు కాకులగుట్టతండా జీపీ పరిధిలోని సర్వేనంబర్ 64/6,235/డీ2లో 0.35 ఎకరాల భూమి ఉన్నది. దీనికి ఆనుకొని ఉన్న వారి బంధువులకు సంబంధించిన 0.33 ఎకరాల భూమి (సర్వే నంబర్ 235/డీ1) కొనుగోలుచేశారు. మొత్తం 1.28 ఎకరాల భూమి ఇతని ఆధీనంలో ఉన్నది. ఆ భూమిలో ఇతనే పంటను పండిస్తున్నాడు. కానీ రెవెన్యూ రికార్డుల్లో సర్వేనంబర్ 235/డీ1లో ఉన్న 0.33 ఎకరాల భూమి మాత్రమే చూపిస్తున్నది. ప్రస్తుతం అతడు రైతుబంధు చెక్కును రెండుసార్లు కోల్పోయారు. వీఆర్వో చుట్టూ మూడు నెలల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, తాసిల్దార్‌కు విజ్ఞప్తి చేసినా పనికాలేదని సత్యనారాయణ వాపోయారు.

324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles