ప్రమాదవశాత్తు లారీ దగ్ధం

Mon,November 11, 2019 01:44 AM

రాజాపూర్‌: ప్రమాదవశాత్తు లారీకి నిప్పంటుకున్న ఘటన ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ సమీపంలో నేషనల్‌ హైవే 44పై చోటు చేసుకున్నది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి ఐరన్‌ లోడ్‌తో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ (ఏపీ 02 యూ 233)వెనుక టైర్‌ పగిలి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించని లారీడ్రైవర్‌ అలాగే నడపటంతో రాజాపూర్‌ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సిబ్బందితో కలిసి లారీని వెంబడించగా.. గమనించిన డ్రైవర్‌ షా ఫంక్షన్‌హాల్‌ సమీపంలో లారీని రోడ్డుమధ్యలో నిలిపి పారిపోయాడు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్‌ వచ్చి మంటలను అదుపు చేసింది. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles