మళ్లీ నోరుజారిన నారా లోకేశ్Fri,April 21, 2017 03:17 PM

nara-lokesh
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు, ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ నాలుక కరుచుకున్నారు. అర్థంపర్థంలేని మాటలతో జనాన్ని, పార్టీ నేతలను కంగారు పెట్టిస్తున్నారు. ఇటీవలే అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా బహిరంగ సభలో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఇక గురువారం ఈ రెండింటినీ మించిపోయే వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.

అయితే ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 మాత్రమే. అలాంటప్పుడు టీడీపీని 200 స్థానాల్లో ఎలా గెలిపించాలో అర్థంకాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. లోకేష్ వాక్‌చాతుర్యాన్ని చూసి ఇటు నారావారి అభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. లోకేష్ బాబు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తెలుగు భాష‌పై కొంచెమైనా క‌స‌ర‌త్తు చేసి ఉంటే బాగుండును అని, నెట్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్టు బ్యాటింగ్ కు దిగితే ఇట్లనే ఉంట‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

14330
Tags

More News

VIRAL NEWS