గులాబీ రెపరెపలు


Fri,May 24, 2019 04:06 AM

Lok Sabha Election Result 2019 TRS Win in 9 BJP 4 Congress 3 seats in Telangana

-టీఆర్‌ఎస్ పార్టీకి 41.3% ఓట్లు.. 9 స్థానాల్లో విజయదుందుభి
-జాతీయ పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టిన రాష్ట్ర ప్రజలు
-కేసీఆర్ సైనికుల పట్ల విశ్వాసం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మెజార్టీ స్థానాలను దక్కించుకున్నది. మొత్తం 17 స్థానాల్లో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 10 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను గెలిచి మొదటిస్థానంలో నిలిచింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 41.30% ఓట్లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకున్నది. కాంగ్రెస్ 29.50%, బీజేపీ 19.40% ఓట్లను దక్కించుకున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా వ్యూహంతో ఎన్నికల రంగంలోకి దిగి.. పార్టీ నాయకులను సమన్వయం చేయడం ద్వారా గులాబీ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు వరంగల్‌లో పసునూరి దయాకర్, మహబూబాబాద్‌లో మాలోత్ కవిత, పెద్దపల్లిలో వెంకటేశ్ నేతకాని, నాగర్‌కర్నూలులో పీ రాములు, మహబూబ్‌నగర్‌లో మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్లలో జీ రంజిత్‌రెడ్డి, మెదక్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు విజయదుందుభి మోగించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం, రాష్ట్ర సమస్యలను కేంద్రం వద్ద ప్రస్తావించటం సీఎం కేసీఆర్ సైనికులతోనే సాధ్యమని విశ్వసించిన ప్రజలు రాష్ట్రంలో గులాబీ పార్టీకి మెజార్టీ స్థానాలను అందించారు. జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేసినా వాటిని తిప్పికొట్టారు.
TRS-KCR1
TRS-KCR2
TRS-KCR3
TRS-KCR4
TRS-KCR5

7245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles